Nagam Varshit Reddy: సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: డా.నాగం వర్షిత్ రెడ్డి
ప్రజా దీవెన,నల్గొండ టౌన్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి .. అలాగే పార్టీ నాయకులతో కలిసి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..
ఈ సందర్భంగా నాగం ముర్షిత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడం లో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైన దని వర్షిత్ రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, బిజెపి రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు జగ్జీవన్ రామ్, బిజెపి జిల్లా నాయకులు పకీరు మోహన్ రెడ్డి, కొత్తపెళ్లి వెంకట్, కూతురు విజయ, గుగులోతు తార, తదితరులు పాల్గొన్నారు