Bandi Sanjay: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: జనవరి 2025 లో జరిగే జనగణనలో బీసీ కులగణను చేయాలని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీసీ నేత లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయన నివాసంలో కలిసి వినతిపత్రం సమ ర్పించినట్లు జాజుల పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ దేశంలో అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నా యని కానీ మెజార్టీగా ఉన్న బీసీల కు ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు తోనే కులాల సాంఘీక ఆర్థిక అభివృద్ధి జరుగు తుందని అన్నారు.జనవరి 2025 లో జరిగే జనగణనలో బీసీ కులగ ణను చేయాలని కోరారు. కులగణ నతోనే కులాల యొక్క సామాజి క,ఆర్థిక,రాజకీయ పరిస్థితులు తెలుస్థాయి. మంత్రిని కలిసిన వారిలో బీసీ యువజన సంఘం నాయకులు ఈడిగ శ్రీనివాస్ ఉన్నారు.