— సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యం
ప్రజా దీవెన, నకిరేకల్: నల్గొండ జిల్లాలో మానవత్వం మంటగలిసిన సంఘటన వెలుగు చూసింది. మనవసంబంధాలు అటకెక్కి సమాజం విడుదూరంలో వెళ్తుందన్న ఊహాజనితాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ తాజా సంఘటన. వయసు మీ ద పడి అందులోనూ అవిటి మామ పై కనీస కనికరం లేకుండా అరా చకానికి పాల్పడింది ఓ కోపోద్రిక్తు లాలైన మహిళా కోడలు. వృద్దా ప్యంలో మామను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోడలు విచ క్షణ కోల్పోయి తండ్రి వయసు గల మామ పై రాక్షసంగా ప్రవర్తించింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం వేములపల్లి మండలo శెట్టి పాలెంలో చోటుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరిలో ప్రతిస్పందన తో కదిలించింది. శెట్టిపాలెం కు చెందిన అవిటివాడై వీల్ చైర్ లో జీవనం సాగిస్తున్న వృద్దుడు పేరు బుచ్చి రెడ్డి ఈయనకు ఇద్దరు కొడుకులు న్నారు.
వారసత్వంగా వచ్చిన ఆస్తి ని ఇద్దరికీ సమభాగాలుగా పంచా డు తండ్రి బుచ్చిరెడ్డి.రెండు ఎకరా లు మాత్రం భాగం పంచలేదు. ప్రస్తు తం చిన్న కొడుకు శేఖర్ రెడ్డి దగ్గరే ఉంటున్నాడు.తన వద్ద ఉంచుకు న్న రెండెకరాల భూమిని చిన్న కొడుకుకు రిజిస్ట్రేషన్ చేశారనేది పెద్ద కోడలు మనిమాల అనుమా నం. ఆ అనుమానంతోనే మామతో తాడో పేడో తేల్చుకోవాలని చూసిం ది మనిమాల.ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ పై విచక్షణార హితంగా దాడి చేసింది పెద్ద కోడలు మనిమాల.వీల్ చైర్‌లో ఉన్న మా మ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది.
కొడుతూ బండ బూతులూ తిట్టింది.కొట్ట్టొద్దని కా ళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలి రాతి గుండె కరగలేదు.అయితే కోడలి దాడి దృశ్యాలు మొత్తం ఇంటి ముందు గల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తో సదరు కోడలి వ్యవహారం వెలు గులోకి వచ్చినట్టయ్యింది. దాడికి పాల్పడ్డ మనిమాల పై కఠిన చర్య లు తీసుకోవాలనే డిమాండ్ సర్వ త్రా వ్యక్తమవుతోంది.
Village lady beat her uncle pic.twitter.com/dR9VWIZ9cB
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) December 8, 2024