Mohammed Siraj is humanity: మహ్మద్ సిరాజ్ మానవత్వం
-- ప్రైజ్ మనీని గ్రౌండ్ సిబ్బందికి బహుమతి -- ప్రసంలoదుకుంటున్న మన హైదరాబాదీ
మహ్మద్ సిరాజ్ మానవత్వం
— ప్రైజ్ మనీని గ్రౌండ్ సిబ్బందికి బహుమతి
— ప్రసంలoదుకుంటున్న మన హైదరాబాదీ
ప్రజా దీవెన/ శ్రీలంక: భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ ఫైనల్లో చిచ్చర పిడుగు లా రెచ్చిపోయిన మన హైదరాబాదీ క్రికెటర్ మానవత్వం చాటుకున్నారు. మ్యాచ్ లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఇండియాకి సునాయస విజయాన్ని అందించిన సిరాజ్ ట్రెండింగ్ లో ఉండగానే తాను చేసిన మరో మంచి పనితో విపరీత వైరల్ అయ్యాడు.
ఇదిలా ఉండగా డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను దారుణంగా ఓడించిన విషయం తెలిసిందే. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఆసియా కప్ ని గెలుచుకోవడానికి మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణంగా మహ్మద్ సిరాజ్ నిలిచాడు.
దీంతో ప్రపంచం సిరాజ్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి అంతా సిరాజ్ గురించే మాట్లాడుకుంటున్న తరుణంలో కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అయ్యాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న క్రమంలో అతనికి ప్రైజ్ మనీ కింద రూ. 4 లక్షల రివార్డు రాగా సిరాజ్ మాత్రం తనకి వచ్చిన మొత్తం ప్రైజ్ మనీ మొత్తాన్ని ఆ స్టేడియంలోని శ్రీలంక గ్రౌండ్ సిబ్బందికి గిఫ్ట్ గా ఇచ్చేశాడు.
అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ మాట్లాడుతూ ఇదంతా ఒక కలలా ఉంది. ఈ రోజు పిచ్ ఎక్కువ స్వింగ్ కి అనుకూలించింది. దీంతో ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. గ్రౌండ్ మెన్స్ లేకుండా ఈ టోర్నీ సాధ్యం అయ్యేది కాదు. వాళ్ళ కష్టానికి గుర్తింపుగా నాకు వచ్చిన ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని వారికి ఇచ్చేస్తున్నాను అని తెలిపాడు. దీంతో మరోసారి సిరాజ్ ని అందరూ పొగిడేస్తూ అభినందిస్తున్నారు. ఇక పోతే సిరాజ్ మన హైదరాబాద్ వాడు కావడం విశేషం.