Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: రతనాల సీమ సంస్కృతికి ప్రతి రూపం తెలంగాణా తల్లి

ప్రజా దీవెన, హైదరాబాద్ :బీఆర్ అంబే ద్కర్ సచివాలయం ఆవరణ లో ప్రతిష్టాపన చేయనున్న తెలంగా ణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశంపై ము గో గో ఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. “చరిత్ర ఉన్నం తవరకు తెలంగాణ ప్రజల గుండె ల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతి తో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నానని పేర్కొంటూ “నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి.. అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వ్యాఖ్యలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే. అస్తిత్వానికి మూలం సంస్కృతి.

ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్య పరిచే లక్ష్యసాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహూళ్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లేదు. అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల.. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది.

తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరిం చేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైం దని ఈ పవిత్ర శాసనసభ సాక్షిగా అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సంప్రదాయా లు, సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటె.. గుండు పూసల ఆహారంతో, చెవులకు బుట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది.

కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సంప్రదాయ పంటలైన వరి జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది.
తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామానే ఉద్యమాలు పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు, దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్న తంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజే స్తున్నాయి.తెలంగాణ తల్లి రూప కల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది. గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో, నీలి వర్ణం గోదావరి, కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడపంగా… అన్న అందెశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలు స్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలలో పసిడి సిరులు పండంగా.. అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది” అని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రకటనను ముగిస్తూ…“నాలుగు కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజా ప్రభుత్వం అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం. సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ గుండెకాయ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉంచాలి, ప్రతిష్టించాలి అని ప్రభుత్వం భావించి. ఈరోజు సాయంత్రం 06:05 నిమిషాలకు తెలంగాణ మాతృమూర్తిని తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నామని అన్నారు.