ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులమీ దుగా ఇటీవల ప్రారంభిం చిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం (సెట్విన్)లో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని శిక్ష ణ కేంద్రం ఇన్చార్జి ఏం.సరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిష న్,ఆర్ అండ్ ఏసి, మొబైల్ సర్వీ సింగ్,సిసి టీవీ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబిం గ్,కంప్యూ టర్స్, ఆటోమొబైల్స్ లో అనుభ వం గల వారి నుంచి ఈనెల 18 వరకు నల్గొండలోని దేవరకొండ రోడ్ లో గల సెట్విన్ కేంద్రంలో దర ఖాస్తులు స్వీకరించడం జరుగుతుం దని పేర్కొన్నారు.
ఫ్యాషన్ డిజైనిం గ్ సంబంధించి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లమా లేదా ఏదైనా విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ, బ్యూటి షన్ కు బ్యూటిషన్ లో డిప్లమా లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, ఆర్అండ్ ఏసి అభ్య ర్థులకు పాలిటెక్నిక్ లేదా ఇంజనీ రింగ్ అభ్యర్థులు అర్హులని పేర్కొ న్నారు.మొబైల్ సర్వీసింగ్ అభ్యర్థు లకు మొబైల్ సర్వీసింగ్ లో డిప్ల మా లేదా ఏదైనా విశ్వవిద్యాల యం నుంచి డిగ్రీ,సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్ అభ్యర్థులకు డిప్లమా లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, ఎల క్ట్రీషియన్ కు డిప్లమా ఇన్ ఎల క్ట్రికల్ ఇంజనీరింగ్, ప్లంబింగ్ కు డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్‌కు ఎంసీఏ/ఎమ్మెస్సీ (కంప్యూటర్స్), బీఎస్సీ (కంప్యూ టర్స్), ఆటోమొబైల్ అభ్యర్థులకు డిప్లమా ఆటోమొబైల్స్ లో అనుభ వం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చే సుకోవడానికి అర్హులని పేర్కొన్నా రు.ఆయా కోర్సులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు రూ.15 నుం చి 20 వేల వరకు వేతనం అందిం చడం జరుగుతుందని తెలిపారు.
ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలిక మని, ఎట్టి పరిస్థితులలో రెగ్యులర్ చేయబడవని స్పష్టం చేశారు. అర్హు లైన,ఆయా కోర్సులలో అనుభవం ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపి క చేయడం జరుగుతుందని తెలి పారు. పూర్తి వివరాలకు సెట్విన్ కేంద్రం ఇంచార్జ్ సెల్ 970504 41789 నెంబర్ ను సంప్రదిం చాలని కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.