ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంకు కు సోమవారం నియోస్పార్క్ వెటర్నరీ మందుల కంపెనీ దక్షిణ తెలంగాణ ఏరియా మేనేజర్ చల్లా వెంకటేష్ 26,733 రూపాయల పశువుల మందులను విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మూగజీవులకు మందుల ద్వారా వ్యాపారం చేసే తమ కంపెనీ మూగజీవులకు ఉచితంగా మందులు సహాయం చేసి పశు సేవలో పాలుపంచుకునేందుకు అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
అలాగే డాక్టర్ పెంటయ్య మాట్లాడుతూ కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన దాతల సహకారంతో చిన్న కారు పశుపోషకులకు ఉపయోగపడుతుందని తెలిపారు ఔషధ బ్యాంకు సేవలు గుర్తించి తనవంతుగా మందులు విరాళంగా ఇచ్చిన కంపెనీని ఆయన అభినందించారు దాతల సహకారంతో మరింత పశు ఔషధ బ్యాంకు ను విస్తృతపరిచి కోదాడ ప్రాంత పశువులకు ఉచిత మందులు ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కంపెనీ అసిస్టెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ సిబ్బంది చంద్రకళ తదితరులు పాల్గొన్నారు