ప్రజా దీవెన, కోదాడ: ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యానికి దిక్సూచి మానవ హక్కులే అని కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హడ్సరాణి మేడం అన్నారు. మంగళవారం కేఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో చరిత్ర,రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1948 సంవత్సరం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన మానవ హక్కుల ప్రకటన రోజును మానవ హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు.
నేడు ఆధునిక ప్రజాస్వామ్య దేశాలన్నీ తమ దేశ పౌరులకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు కల్పిస్తూ మానవ హక్కులను అంది స్తున్నాయ న్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకొని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి దేశ అభివృద్ధికి పౌరులు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జి సైదులు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు పి సైదమ్మ, ఎస్.ఎం.రఫీ, జి ఎల్ ఎన్ రెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు