ప్రజా దీవెన, శాలిగౌరారం: కుటుంబ కలహాల తో జీవితం పై విరక్తి చెందిన ఒక యువకుడు వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి శాలిగౌరారం ఎస్ ఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్ (30) నకిరేకల్ లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి నాలుగు సంవత్సరాల క్రితం సూర్యాపేట కు చెందిన శివలీల తో వివాహం జరిగింది.
వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. గత సంవత్సరం నుంచి భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే భార్య శివలీల తన తల్లీ గారు ఇళ్ళైన సూర్యాపేట కు వెళ్ళింది. మంగళవారం సూర్యాపేట లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగే సమయం లో మాధగోని ప్రశాంత్ భార్య శివలీల, అత్త, బామ్మర్ది కలిసి ప్రశాంత్ ను దుశించారు. దీంతో వెంటనే ప్రశాంత్ వల్లాల కు చేరుకొని మంగళవారం అర్దరాత్రి తన వ్యవసాయం భూమి లో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డాడు.ప్రశాంత్ తండ్రి యాదయ్య పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్త్ చేస్తున్నట్లు ఎస్ ఐ సైదులు తెలిపారు.