Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Manchufamily : మంచు బాబుకు మస్త్ షాక్, ఎఫ్ఐఆర్ లో హత్యాయత్నం కేసుగా మార్పు

మంచు బాబుకు మస్త్ షాక్, ఎఫ్ఐఆర్ లో హత్యాయత్నం కేసుగా మార్పు

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సంఘటన గా ఉద్రిక్తత వాతావరణం సృష్టించిన మంచు మోహన్ బాబు మీడి యాపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. రాష్ట్రవ్యాప్తంగా టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై దాడి చేసిన మోహన్‌బాబుకు పోలీసులు ఊహిం చని షాకిచ్చారు. నిన్న కేవ లం 118 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి న పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉధృతమైన జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో లీగల్‌ ఒపీనియన్‌కి వెళ్లిన రాచకొం డ పోలీసులు టీవీ9 ప్రతినిధి రంజి త్‌పై దాడి చేసిన మోహన్‌బాబుకు ఊహించని షాకిచ్చారు. బుధవారం కేవలం 118 సెక్షన్‌ కింద కేసు న మోదు చేసిన పోలీసు లు గురు వారం ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేశారు. జర్నలిస్టు సంఘా ల ఆందోళనలతో లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని సెక్షన్ ను మార్చిన రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమో దు చేశారు.

జర్నలిస్ట్ రంజితపై దాడి ఘటనలో BNS 109 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆ ర్‌ నమోదు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తన పాప ఇంట్లో ఉందని, తన భార్యతో కలిసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు మంచు మనోజ్. దీంతో అతడిని సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగిన మనోజ్ గేట్లు తోసుకుని మరీ ఇంట్లోకి వెళ్లారు.

అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధు లను మోహన్ బాబు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. టీవీ9 జర్నలిస్ట్ రంజి త్ చేతిలోని మైక్ తీసుకుని అతడిపై బలంగా దాడి చేశాడు. ఈ ఘ టనలో టీవీ9 రిపో ర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కంటి కి, చెవికి మధ్య మూడు లెవల్స్ లో ఫ్రాక్చర్ అ య్యిందని సెన్సిటివ్ జైగోమాటిక్‌ ఎముక విరగడంతో అతడికి బుధవారం సర్జరీ చేశారు వైద్యు లు.

రంజిత్ పై దాడి మోహన్ బాబు దాడి చేయడంపై జర్నలిస్ట్ లోకం భగ్గుమంది. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలతో హోరె త్తించాయి. మీడియా ప్రతిని ధులపై దాడి చేసిన మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశా రు. దీంతో పోలీసులు లీగల్ ఒపీనియన్‌ కు వెళ్లి సెక్షన్ మార్చి మో హన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Manchufamily