ప్రజా దీవెన, శాలిగౌరారం: కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఏర్పాటు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థను 2014 కేసీఆర్ ప్రభు త్వం రద్దు చేయడం వల్ల 16 వేల కుటుంబాలు బజారున పడ్డాయాని తిరిగి సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్దరణ చేసి ఆదుకోవాలని రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం అధ్యక్షులు కసిరబోయిన లింగం యాదవ్ కోరారు.
నల్గొండ జిల్లా శాలిగౌరారం లోని వ్యవసా యం మార్కెట్ యార్డ్ లో నకిరేకల్ డివిజన్ ఆదర్శ రైతు సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతి ధిగా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్న లింగం యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆదర్శ రైతు వ్యవస్థ ను పునరుద్ద రిస్తాని ఎన్నికల మేనిఫెప్టో లో హామీ ఇచ్చారన్నారు. ఇటీవల వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను తాము కలిసి నపుడు తిరిగి ఆదర్శ రైతులను తీసుకుంటామని చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఆదర్శ రైతులను ఇంకా విధుల్లోకి తీసుకోక పోవడం అన్యాయం మన్నారు. తమను విధుల్లోకి తీసుకుంటే రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడం లో తాము ముందటమన్నారు.
రైతు భరోసా, రైతు భీమా, డిజిటల్ క్రాప్ సర్వే తదితర విషయాల్లో మండల స్థాయి లో ని ఏవో లకు, ఏఈఓ ల కు సహాయ, సహకారం తో ఆదర్శ రైతు వ్యవస్థ పని చేస్తుంద న్నారు.బజారున పడ్డ 16 వేల మంది ఆదర్శ రైతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధుల్లోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు మెదరమెట్ల కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బట్ట శివ బిక్షం, నకిరేకల్ డివిజన్ అధ్యక్షులు దొంతూరి శంకర్, నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, శాలిగౌరారం మండల అధ్యక్షులు ఒంటెపాక భీమయ్య, గందమళ్ళ అంతయ్య, దుర్గం అంజయ్య, బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శులు అల్లి సైదులు, వేముల వెంకన్న, రంగు వీరయ్య, చనగాని లింగయ్య పాల్గొన్నారు