ప్రజా దీవెన, శాలిగౌరారం: గత దశాబ్ద కాలంగా అపరిస్కృతం గా ఉన్న మోడల్ స్కూల్ సమ స్యలను పరిష్కరించాలని, తాము దశల వారీగా నిరసన కార్యక్రమా లు చేపట్టుతున్నట్లు పిఎంటిఏ టి ఎస్ రాష్ట్ర కన్వీనర్ కుక్కడపు శ్రీనివాస్ కోరారు. గురువారం భోజన విరామ సమయం లో శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో పా ల్గొన్న కన్వీనర్ కుక్కడపు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సమస్యల పరిస్కార సాధన కోసం నేటి నుంచి జనవరి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టు తమన్నారు. ఈ కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ, సంపత్ కుమార్, కృష్ణయ్య, శ్రీను, సంధ్యారాణి, సృజన, సంధ్య, సంగీత, అనురాధ, శ్వేత, శ్రీరాములు, పీడీ బొడ్డు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.