Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttamkumar Reddy: ఉద్యోగాల ఎంపికకు, పోటీ పరీక్షలకు విజయ దీపిక ఎంతో ఉపయోగం

గ్రామీణ ప్రాంతనిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల మెటీరియల్ అందిస్తున్న కృష్ణయ్య
నిరుద్యోగ యువతీ యువకులు విజయ దీపికను సద్వినియోగం చేసుకోవాలి; ఉత్తంకుమార్ రెడ్డి

ప్రజా దీవెన, కోదాడ:గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ అందిస్తున్న విద్యావేత్త అనంతరపు కృష్ణయ్య కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతరపు కృష్ణయ్య రూపొందించిన విజయ దీపిక పోటీ పరీక్షల మెటీరియల్ను విడుదల చేసి మాట్లాడారు కృష్ణయ్య రాస్తున్న పోటీ పరీక్షల పుస్తకాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుని పొందుతున్నాయని కొనియాడారు.

నగరాలకు మాత్రమే పరిమితమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలను గ్రామీణ ప్రాంతం కోదాడకు అందుబాటులోకి తెస్తున్న కృష్ణయ్య అభినందినీయులు అన్నారు విజయ దీపిక పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ బ్రహ్మం తదితరులు ఉన్నారు