ప్రజా దీవెన /కనగల్: ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే వస్తారు వైద్య సేవలు నిర్లక్ష్యంగా ఉంటే అధికారులకు చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో కనగల్ మండలానికి కేటాయించిన అంబులెన్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అంబులెన్స్ కు భిన్నంగా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసి రూపొందించిన 108 అంబులెన్స్ వాహనాన్ని కనగల్ మండలానికి కేటాయించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన అధునాతన 108 అంబులెన్స్ వాహనంలో మానిటరింగ్ వ్యవస్థతోపాటు, ఎదైనా పాయిజన్ కేసు వచ్చినట్లైతే దానికి అంబులెన్సులోనే చికిత్స అందించే విధంగా సౌకర్యాలు ఈ అంబులెన్స్ లో ఉన్నాయని ,ప్రజలు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం ఆమె సబ్ సెంటర్ వారిగా మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంపొందింపజేయాలని అన్నారు.ఆయా సబ్ సెంటర్లకు ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, జబ్బులు,తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో నాణ్యత పరంగా సేవలను పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే వస్తారని, అందువల్ల వారికి వైద్య సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ పక్కనే నిర్మాణంలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని పరిశీలించారు.భవన నిర్మాణం పూర్తయినందున ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లను చేయాలని చెప్పారు .
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి,సి పి ఓ వెంకటేశ్వర్లు,తహసీల్దార్ పద్మ, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
