The good news is that… air and tubeless tires are coming: శుభవార్త వచ్చిoదోచ్…గాలి, ట్యూబ్ లేని టైర్ లు రాబోతున్నాయి
శుభవార్త వచ్చిoదోచ్…గాలి, ట్యూబ్ లేని టైర్ లు రాబోతున్నాయి
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: సైకిల్ కైనా, ద్విచక్ర వాహనం నుంచి 24చక్రాల భారీ వాహనాల వరకైనా గాలి, ట్యూబ్, ట్యూబ్ లెస్ టైర్లు అవసమని మనందరికి తెలుసు. పేరేదైనా దాదాపు అన్ని వాహనాలలో కొన్ని టైర్లలో ట్యూబ్‌లు, మరికొన్ని ట్యూబ్‌లెస్ టైర్లుగా ఉంటూ మనుగడలో ఉన్నాయి. అయితే అన్నిటిలో గాలి నింపడం పరిపాటి లేదంటే పనిచేయలేవు.
అంతేకాదు ఇవి తరచుగా పంక్చర్ కూడా అవ్వడం ప్రయాణానికి అవరోధం కలగడం, ఇంకా చెప్పాలంటే మరికొన్ని పర్యాయాలు ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. ఈ క్రమంలో పై సమస్యలు తలెత్తకుండా Ohio కంపెనీ ఎయిర్‌లెస్ టైర్లను తయారుచేసింది. NASA రోవర్ టైర్ టెక్నాలజీని అనుగుణంగా ఈ టైర్లని రూపొందించారు.
అయితే ఎయిర్‌లెస్ టైర్ విధానాన్ని ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదని, ఇంతకుముందు బ్రిడ్జ్‌స్టోన్, మిచెలిన్ మొదలైన కంపెనీలు కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లను ప్రవేశపెట్టాయని ఆయా వర్గాలు అంటున్నాయి. SMART ఎయిర్‌లెస్ టైర్లు మార్కెట్లోకి వచ్చి ప్రస్తుతం సైకిళ్లకు మాత్రమే అమర్చారు. భవిష్యత్తులో కార్లు, బైక్‌లకు కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి.
కాయిల్-స్ప్రింగ్ ఇంటర్నల్ నిర్మాణం కారణంగా టైర్ బెండ్ కాకుండా ఉంటుంది. వీటిలో గాలి నింపాల్సిన అవసరం, పంక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉండబోదు. ఈ టైర్ రబ్బరుతో కాకుండా లోహంతో తయారవుతుoడగా ఇది స్లింకీ లాంటి స్ప్రింగ్‌ని కలిగి ఉంటుంది. ఈ స్ప్రింగ్ నికెల్-టైటానియం మెటల్‌తో తయారవుతుంది.
ఈ లోహాన్ని నిటినోల్ అని పిలుస్తారు. టైటానియం లాగా దృఢంగానూ, రబ్బరులా ఫ్లెక్సిబుల్ గానూ ఉండడం దీని ప్రత్యేకత. నిటినోల్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు దాని ఆకారం మారిపోతుంది తర్వాత పాత స్థితికి వస్తుంది. ఇది మెటల్ టైర్‌కు నెమ్మదిగా కంప్రెస్, రీబౌండ్ చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది సాధారణ రబ్బరు టైర్ లాగానే ఉంటుంది. దీనివల్ల వాహనాలు ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరగకకుండా చూస్తుంది.