కల్తీ పాల స్వాధీనం
— యాధాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
ప్రజా దీవెన / భువనగిరి: యాధాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు పోలిసులు. కల్తీ పాలు తయారు చేస్తున్న కప్పల రవి అనే వ్యక్తిని భువనగిరి ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద 350 లీటర్ల కల్తీ పాలు,100ml హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిదంగా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామం లో కల్తీ పాల వ్యాపారం చేస్తున్న కుంభం రఘు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద 100 లీటర్స్ కల్తీ పాలు, 200. ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.