Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bigg Boss Season 8 Finale: నేడే బిగ్ బాస్ సీజన్-8- ఫైనల్, హౌస్ ను మోహరించిన పోలీసులు

ప్రజా దీవెన, హైదరాబాద్: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ నేడు జరగనుంది, ఈ నేప థ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటు వంటి గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడి యో లోని బిగ్ బాస్ హౌస్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బం దోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధు సూదన్ తెలిపారు. గత ఏడాది సీజన్ 7 ఫైనల్ లో జరిగిన ప్రమా దం లాంటివి జరగకూడదని ఈ సారి ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరు కుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ ఉన్నారు. ఆదివారంతో ఈ షో ముగిం పు పలకనుంది. నేడే విజే తను ప్రకటించనున్నారు.ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడి యో వద్ద పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఈ సారి అలాంటి ఘటనలు జరగ కుండా జూబ్లీహిల్స్ పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వేంక టేశ్వర రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌తో సహా ఎస్ఐలు పోలీసు బృందం అంతా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.