Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vishwas Scheme 2024: వివాద్-సే. విశ్వాస్ స్కీమ్ 2024 పై అవగాహనా సదస్సు

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రధాన ఆదాయపు పన్ను కమీషనరు-1, హైద్రాబాద్ వారి ఆధ్వర్యంలో, ఆదాయపు పన్ను సంయుక్త’ కమీషనరు-3, హైద్రాబాదు పర్యవేక్షణలో నల్గొండ ఆదాయపు పన్ను అధికారి ఆదాయపు పన్న `వివాద్-సే. విశ్వాస్ స్కీమ్, 2024′ సంబంధించి ఒక అవగాహన సదస్సును జిల్లా కలెక్టరేట్లో ని ఉదయ ఆదిత్య భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్లలు మరియు ఆదాయపు పన్ను ప్రాక్టీషనర్లు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఆదాయపు పన్ను, డిప్యూటీ కమీషనర్, సర్కిల్- 3(1) హైద్రాబాద్ రవి కిరణ్, IRS పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించగా, హైద్రాబాదు రేంజ్-3 సంయుక్త కమీషనర్ మూకాంబి- కేయన్, IRS సదస్సులో పాల్గొన్నారు.సభ్యుల సందేహాలను వివరంగా నివృత్తి చేశారు. ఈ సదస్సును ఉద్దేశించి స్థానిక ఆదాయపు పన్ను అధికారి శ్రీ లింగ బత్తుల మోహన్ ప్రసంగిస్తూ 1 అక్టోబరు, 2024. నుండి అమలులోకి వచ్చిన ఈ “ఆదాయపు పన్ను వివాద్ -సే- విశ్వాస్ స్కిమ్, 2024” ఉపయోగించుకొని ఆదాయపు పన్ను సంబంధిత వివాదాలను పరిష్కరించుకొనేందుకు తగిన సలహాలు, సహాయం అందించడానికి ఇరు జిల్లాలోని ఛార్టెడ్ అకౌంటెంట్లు మరియు ఆదాయపు పన్ను ప్రాక్టీషనర్లు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్త పరిచారు.