Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road accident: అసువులుబాసిన ఆరుగురు

Road accident: ప్రజా దీవెన, గుజరాత్: ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం పాలైన విషాద ఘ‌ట‌న గుజరాత్ రాష్ట్రంలో భావ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. త్రపాజ్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం ప్రైవేటు బస్సు- ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు భావ్‌నగర్ నుంచి మాహువ వెళ్తుం డగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పోలీసులు వాహ నాలను పక్కకు తొలగించారు. ఇం కా వివరాలు తెలియాల్సి ఉంది.