ప్రజా దీవెన, శాలిగౌరారం :విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల ఆత్మ సైర్థ్యం తో విద్యానభ్యసించి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్ పర్సన్,యూత్ ఎంపవర్మెంట్ ట్రైనర్ లయన్ రేపాల మదన్ మోహన్ అన్నారు. మంగళవారం శాలిగౌరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 10 వేల విలువ గల స్పోర్ట్స్ మెటీరియల్ ను మదన్ మోహన్ అందజేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటైనా సమావేశంలో రేపాల మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి కి విద్య తో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు. చదువు మేధా శక్తిని పెంపోదిస్తే,ఆటలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుడ్యానికి తోడ్పాడుతాయానన్నారు.
ప్రతి విద్యార్ధి తనకు ఇష్టమున్న ఆటలపై మక్కువ పెంచుకొని ఆటల్లో రాణిoచాలని కోరారు. ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో దాదాపు 100 పాఠశాలకు తాను స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తున్నట్లు మదన్ మోహన్ తెలిపారు.విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించి తల్లి దండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ వెంకటేశ్వరరావు,లయన్స్ క్లబ్ డిసి మెంబర్, హంగర్ రిలీఫ్, గట్టుపల్లి అశోక్ రెడ్డి,నల్గొండ లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, నకిరేకల్ లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమ చారిటబుల్ ఛైర్మెన్ నెమరుగోమ్ముల రామ్మోహన్ రావు,ఫాస్ట్ జోన్ ఛైర్మెన్ ఎర్ర శంభులింగారెడ్డి,జడ్పి స్కూల్ హెచ్ ఎం కోట మల్లయ్య,శాలిగౌరారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, కోశాధికారి వడ్లకొండ బిక్షం,సభ్యులు దునక వెంకన్న,రామడుగు వెంకట్రామ శర్మ, బట్ట చిన సైదులు,కప్పల శ్రీకాంత్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.