ప్రజా దీవెన, నల్గొండ టౌన్: భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలోని 32 వ వార్డులో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి సమక్షంలో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో నూతన బిజెపి 114వ బూత్ అధ్యక్షురాలుగా మునగాల సుధారాణిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు, సెక్రటరీగా రాఘవుల జ్యోతిని ఎన్నుకున్నారు.అదేవిధంగా 110 వ బూత్ అధ్యక్షులుగా యేలిజాల ప్రవీణ్ ను , సెక్రటరీగా పరస మాధవి నియమితులయ్యారు..
మునగాల సుధారాణి మాట్లాడుతూ..నా ఎన్నికకు సహకరించిన బిజెపి పార్టీ సభ్యులకు మరియు పార్టీ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ బూతులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు.ఈ సమావేశంలో నల్గొండ పట్టణ సభ్యత్వ కన్వీనర్ మిరియాల వెంకటేశం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గగులోతు తార తదితరులు పాల్గొన్నారు