ప్రజా దీవెన, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) భారీ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ను సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఎస్బిఐ బ్యాంక్ 13,735 క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్బిఐ క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్బిఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 17 డిసెంబర్ 2024 నుండి 7 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్బిఐ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద 13,735 పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఇందులో కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో జనరల్ లో 5870 పోస్టులు, EWS కింద 1361 పోస్టులు, OBCకి 3001 పోస్టులు, SC కింద 2118 పోస్ట్లు, ST కింద 1385 పోస్ట్లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
అలాగే వయస్సు పరిమితిని 20 నుండి 28 సంవత్సరాలుగా అధికారులు నిర్ణయించారు. ఇకపోతే, ఎస్బిఐ క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించబడుతుంది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్లైన్), మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్లైన్), లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి.