ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బుధవారం శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.అయ్యప్ప గురుస్వాములు, అర్చక స్వాములు శాస్త్రయుక్తంగా అభిషేకాలు,మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించగా ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చైతన్య దంపతులు,కుటుంబ సభ్యులు ఈ మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొనగా అభిషేకాలు నిర్వహించిగా పంచామృతాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పదునెట్టాంబరి పూజలు చేశారు.అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన ప్రసాదం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప గురు స్వాములు, స్వాముల అందరి సహకారంతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుఖసంతోషాలు,ఆయురారోగ్యాల తో ఉండాలని ఆకాంక్షించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, శ్యామ్ గురు స్వామి, కొలను రవికుమార్, అశోక్, మేడం విశ్వ ప్రసాద్, రాంపాటి శ్రీను గురు స్వామి, కోమటిరెడ్డి పృధ్విధర్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, పలువురు అయ్యప్ప గురు స్వాములు, స్వాములు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.