దసరా విశాఖ లోనే
— ఏపి సిఎం వైయస్ జగన్ హాట్ కామెంట్స్
ప్రజా దీవెన /ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమేనని మనందరికీ తెలుసు. అయితే ఇది కూడా అందరికీ తెలిసినప్పటికీ తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో మరో మారు హాట్ హాట్ వాతావరణం సృష్టించిందని చెప్పవచ్చు. ఆoధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దసరా పండగను విశాఖలోనే జరుపుకోవాలని అనడం సంచలనం రేకెత్తించింది.
దసరా రోజు నుంచే విశాఖలో పరిపాలన సాగిస్తానని ఆయన మంత్రివర్గ సమావేశం అనంతరం వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని, దసరా నాటికి పాలన విశాఖ నుంచి సాగుతుందని తెలిపారని ఓ కీలక నేత నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
తాను ఒక్కడినే అక్కడకు వెళ్లి ముందుగా పాలన ప్రారంభిస్తామని, అమరావతిలో మాత్రం శాసన రాజధాని కొనసాగుతుందని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. ఆయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కూడా మంత్రులకు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమై ముందస్తు ఎన్నికలకు వెళ్లినా మనం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు అవినీతి అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. అవసరమైతే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతిపై చర్చించాలని కూడా జగన్ అన్నారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎవరూ గైర్హాజరు కావద్దని, ఖచ్చితంగా హాజరయ్యేలా చూసుకోవాలని కూడా మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.