ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024, ఈనెల 19, 20 కోదాడ పట్టణంలో సిసిఆర్ పాఠశాల యందు నిర్వహించబడటానికి కావలసిన ఏర్పాట్లను, సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా బుధవారం నాడు సూర్యాపేట జిల్లా సైన్స్ అధికారి ( డి ఎస్ ఓ) L. దేవరాజు కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ గారు తెలియజేసినారు.
బుధవారం18/12/24 మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కోదాడ హుజూర్నగర్ డివిజన్లకు సంబంధించిన ప్రదర్శనల రిజిస్టర్ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం కార్యక్రమాల పోటీలు వ్యాసరచన, డిబేటింగ్ ,క్విజ్ నిర్వహించబడు నని తెలిపినారు. వివిధ కమిటీలకు సంబంధించిన కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు ప్రదర్శనలకు సంబంధించిన విద్యార్థులతో గైడ్ టీచర్స్ సకాలంలో కోదాడ యందు సి సి రెడ్డి పాఠశాలకు చేరుకోవాల్సిందిగా తెలియజేసినారు.