ప్రజా దీవెన,కోదాడ: పట్టణం లోనిస్థానిక ఆర్డిఓ కార్యాలయంలో గురువారం కోదాడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ పాల్గొని పాస్టర్ యేసయ్యతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగను క్రైస్తవలందరు భక్తిశ్రద్ధలతో ప్రార్థన నిర్వహించుకోవాలని తెలిపారు . ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యురాలు వంటిపాగ జానకి యెసయ్య, పాస్టర్ లు మాడుగుల సుందర్ రావు,రాజేష్,యేసురత్నం,దానియేలు,హ్యారీగోమ్స్ తదితరులు పాల్గొన్నారు.