Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSKtr : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం,బిఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేసు

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం,బిఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేసు

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది. అతిపెద్ద సంచలనంగా నిలిచే విధంగా మాజీ మంత్రి కేటీ ఆర్‌పై కేసు నమోదు చేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభు త్వం. నాలుగు సెక్షన్లు నాన్‌బెయి లబుల్‌ కేసులతో ఏసీబీ అధికా రులు, A-1గా కేటీఆర్‌, A-2గా అర వింద్‌ కుమార్‌, A-3గా BLN రెడ్డి పేర్లను చేరుస్తూ కేసు నమో దు చేశారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. కేటీఆర్‌పై నాలు గు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

13(1)A, 13(2) పీసీ యాక్ట్‌ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు. నాలుగు సెక్ష న్లు నాన్‌బెయిలబుల్‌ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు, A-1గా కేటీ ఆర్‌, A-2గా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏ ఎస్‌ అధికారి అర వింద్‌ కుమార్‌, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజి నీర్‌ BLN రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివె న్షన్‌ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పే ర్కొంది.

మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో..ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీం తో తాజాగా ఏసీబీ అధికా రులు కేటీఆర్‌పై కేసులు నమోదు చేశా రు. RBI మార్గదర్శకాలకు విరుద్దం గా FEO సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు ఆరో పించింది. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు రూ.46 కోట్ల మేర నిధులు చెల్లించి నట్లు ప్రస్తావించింది. RBI అనుమతి లేకుండా చెల్లించడంపై రూ.8 కోట్ల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.

కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చిన తర్వాత RBI పెనాల్టీ చెల్లింపు జరిపింది. RBI పెనాల్టీతో ఈ రేస్‌ స్కామ్‌ తో బట్టబయలు అయ్యిం ది. రాష్ట్ర కేబినెట్‌ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో HMDA బోర్డు నుంచి కేటీఆర్‌ ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అధికారులు. అంతే కాదు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు ఏసీ బీ పేర్కొంది. ఫైనాన్స్‌ సెక్రటరీ క్లి యరెన్స్‌ లేకుండానే నిధుల విడు దల అయ్యినట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లిం పులు జరిపినట్లు ఏసీబీ పేర్కొం ది.

ఇదిలావుంటే, కేటీఆర్ మీద నమోదైన కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో స్పందిం చారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి ఈ ఫా ర్ములా రేసు నిర్వహించామ న్నారు. చెల్లింపులు కూడా పారదర్శకం గా జరిగాయని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కడానికి కేసులు పెడు తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఫార్ములా రేస్‌ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డి మాండ్ చేశారు.

*కేటీఆర్‌పై నమోదైన కేసులు ఇలా ఉన్నాయి*…

13(1)A పీసీ యాక్ట్‌ — ఉద్దేశపూర్వకంగా నేరపూరిత చర్యలకు పాల్పడటం.

13(2) పీసీ యాక్ట్‌ కింద కేసులు — ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలు చేసే సెక్షన్‌.

— సెక్షన్‌ 409 కింద కేసు — నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద కేసు నమోదు

— 120B కింది కూడా కేసు నమోదు — ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించడం

కాగా నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశముంది.

BRSKtr