Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar: సైబర్ నేరాల దర్యాప్తులో బ్యాంకర్లు సహకరించాలి

జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

ప్రజాదీవెన, నల్గొండ :సైబర్ బాధితుల సత్వర న్యాయానికి బ్యాంకర్స్ పాత్ర కీలకం. నేర నియంత్రణ కొరకు ప్రతి బ్యాంకు వద్ద తగిన భద్రతా,సిసిటివి కెమెరాల ఏర్పాటు చర్యలు తీసుకోవాలి.సైబర్ నేరాల నివారణ,బ్యాంకుల వద్ద భద్రత చర్యలపై జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన బ్యాంకు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకొని ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నమో అంతే వేగంగా వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని, స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి, క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో సులువుగా డబ్బులు సంపాదించాలని, ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా కేవలం యు.పి.ఐ. మరియు బ్యాంక్ అకౌంట్ లను ఆధారంగా చేసుకొన్న, సైబర్ నేరగాళ్లు తప్పుడు మార్గాలను ఎంచుకొని, అమాయక ప్రజలే టార్గెట్ గా వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు.

సైబర్ నేరాలకు సంభందించి బ్యాంక్ సిబ్బంది దర్యాప్తు అధికారులకు సహకరించాలని, నేరానికి గురైన బ్యాంక్ అకౌంట్స్ సంభందించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. కోర్టు అనుమతితో సైబర్ బాధితులకు చేరవలసిన డబ్బును అకౌంట్ నందు క్రెడిట్ చేసి అట్టి అకౌంట్ ను అన్-ఫ్రీజింగ్ చేసి సైబర్ బాధితులకు అండగా నిలవాలని సూచించారు. సైబర్ బాధితులు కోల్పోయిన డబ్బు రీఫండ్ అయినప్పుడే వారిలో పోలీసు లపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ముందస్తు నేర నియంత్రణ చర్యల కొరకు ప్రతి బ్యాంక్ లోను హై రేసల్యూషన్ కలిగిన సిసి కెమెరాలను బ్యాంక్ లోపల, బయట పెట్టుకోవాలని అదేవిధంగా ఎ.టి.యం సెంటర్ లలో అమార్చాలని సూచించారు. సెక్యూరిటీ అలారంలు బ్యాంక్ లోను, ఎ.టి.యం సెంటర్ లలో అమార్చాలని అన్నారు. ప్రతి బ్యాంక్ వద్ద భద్రత సిబ్బందిని 24/7 ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు.

అలాగే కొంత మంది బ్రోకర్స్ వివిధ స్కీం ల ద్వారా అమాయక ప్రజలకు లోన్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు, అలాంటి వారిని ముందుగానే గమనించి మాకు తెలియపరచాలని అన్నారు.అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాన ఒక్కటే మార్గం అని, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానిత లింక్ లను, apk ఫైల్స్ ఓపెన్ చేయరాదని, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురి అయితే 1930 కి కాల్ చేసి గాని లేదా www.cybercrime.gov.in లో సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బి డీఎస్పీ రమేష్, నల్లగొండ డియస్పి శివ రాం రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మి నారాయణ, ఎస్బి సిఐ రాఘవరావు,ఒన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.