— సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురిం చి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల వాస్తవా లను సమాజం ముందు ఆవిష్కరిం చాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవస రం ఉందని నొక్కి చెప్పారు. ఎన్టీఆ ర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37 వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
తర్వాత బోయి విజయ భారతి వేదికగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు.చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఆవిష్కృత మవుతోందని, పోరాటాల్లో అసులు బాసిన వాళ్లు, అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం గురికావడం, కొంత సమాచార లోపం ఉంటుందన్నారు. సాయుధ రైతాంగ పోరాటం, తొలి దశ తెలం గాణ ఉద్యమైనా, మలి దశ తెలం గాణ ఉద్యమమైనా ఉద్యమాల్లో సమిధలైన, అమరులైన వారికంటే, రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగు తుంది.గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదు ను పెట్టాలన్నారు. సమాజం అధు నాతన యుగం వైపు, సాంకేతిక పరి జ్ఞానం వైపు వెళుతున్న సంద ర్భంలో డిజిటల్, సోషల్ మీడియా ల వంటి మాధ్య మాల వల్ల ఏది వాస్తవమో, ఏది ఆవాస్తవమో గ్రహించే పరిస్థి తులు లేకుండా పోతున్నాయన్నార.
యువతను పుస్తక పఠనంవైపు మళ్లిస్తే వాస్తవా లు తెలుసుకునే వీలుంటుందని, 1985 లో సిటీ సెంట్ర ల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్ట డం, అందులోనూ ఎంతోమంది మేధావులు పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుం దని చెప్పారు. బుక్ ఫెయిర్ నిర్వ హకులు ప్రస్తావించిన విషయాలపై ప్రొ. కోదండరాం నివేదిక రూపంలో అందజేస్తే వాటిని పరిశీలించి సా మాజిక బాధ్యతగా నిర్ణయం తీసు కుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బుక్ ఫెయిర్ అధ్య క్షుడు కవి యాకూబ్, ఎమ్మెల్సీ కోదండరాం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి , ప్రొ. రమా మెల్కోటే , సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి తో పాటు ఎంతో మంది ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు హాజరయ్యారు.