Jai for women in both houses: ఉభయ సభల్లోనూ మహిళకు జై
-- లోక్ సభ, రాజ్యసభ ల్లో ఏకగ్రీవ అమోదం -- రాష్ర్టపతి భవన్ కు నారీ శక్తి వందన్ చట్టం -- మహిళా రిజర్వేషన్ అమలు ఇక లాంచనప్రాయమే
ఉభయ సభల్లోనూ మహిళకు జై
— లోక్ సభ, రాజ్యసభ ల్లో ఏకగ్రీవ అమోదం
— రాష్ర్టపతి భవన్ కు నారీ శక్తి వందన్ చట్టం
— మహిళా రిజర్వేషన్ అమలు ఇక లాంచనప్రాయమే
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు ఇక లాంచనప్రాయమే కానుంది. ఇటీవలనే లోక్ సభ లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు కు సంబంధించిన నారీ శక్తి వందన్ చట్టం రాజ్యసభలో కూడా ఆమోదం ( The Nari Shakti Vandan Act was also passed in the Rajya Sabha) పొంది తుది ఘట్టమైన రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళింది.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, మొత్తంగా 215 ఓట్లు బిల్లుకు మద్దతుగా పడ్డాయని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ బిల్లును రాష్ట్రపతికి పంపగా ఆమోదం లభించిన వెంటనే ఇది చట్టంగా ( As soon as it is sent to the President and approved, it becomes law) మారనుంది. దీంతో ప్రక్రియ పూర్తయిన వెంటనే లోక్ సభ, అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభం కానుంది.
లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించబడింది. దిగువ సభలో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుకు కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు మద్దతు పలకగా ( All opposition as a support plate) ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బిల్లుపై రెండు రోజులుగా ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని, సహచరులందరూ అర్థవంతమైన చర్చలు జరిపారని, భవిష్యత్తులో కూడా ఈ చర్చలోని ప్రతి పదం మన ప్రయాణంలో ఉపయోగపడుతుందని ( Every word of this discussion will be useful in our journey) వ్యాఖ్యానించారు.
ఈ బిల్లుకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ నాకృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని. దీంతో దేశ ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని, ఎంపీలు, రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయని ( Political parties have played a very important role) ఎంపీలందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని, వెంటనే బిల్లును అమలు చేయాలని కోరారు.
అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జన్ ఖర్గే బిల్లుకు నేను హృదయపూర్వకంగా మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. భారత కూటమి పార్టీలు కూడా దీనికి మద్దతిస్తున్నాయని ఈ బిల్లును ఇప్పుడు అమలు చేయాలని, షరతులు లేని మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
ఇందులో డీలిమిటేషన్, జనాభా లెక్కలు అవసరం లేదని, వ్యవసాయ బిల్లు కూడా ఆమోదం పొందడం, నోట్ల రద్దు జరిగింది కాబట్టి, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు కూడా రిజర్వేషన్ లేనందున సవరించాలని( The Women’s Reservation Bill should be amended as there is no reservation for OBCs either) కోరారు.