Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Notices to Tamil Nadu Govt: తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు

-- మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో సహా 

తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు

— మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో సహా 

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై (DMK leader Udayanidhi on controversial comments made by Stalin) సర్వోన్నత నోటీసులు జారీ చేసింది. ఉదయనిధి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీoకోర్టు తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు ( Notices to Supreme Court Tamil Nadu Government, Udayanidhi, which received the inquiry) జారీ చేసింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని  నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.

దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి కి లేఖ ( A letter to the Chief Justice of India, requesting action on the affair) రాశారు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.