Multi Zone Two IG Satyanarayana: వ్యవస్థీకృత నేరాలపైన ప్రత్యేక దృష్టి : మల్టీ జోన్ టూ ఐజి సత్యనారాయణ
ప్రజాదీవెన, నల్గొండ : అసాంఘిక కార్యకలాపాలు పిడియస్ బియ్యం, ఇసుక రవాణా, గంజాయి,జూదం లాంటి అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా కఠిన చర్యలు.వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ అన్నారు.
జిల్లాలో పోలీస్ స్టేషన్లో తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తో కలిసి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పలు రికార్డులను తనిఖి చేసి సిబ్బంది వివరాలు వారి పని యొక్క తీరు,పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని, సిబ్బంది కిట్లను పరిశీలించి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి పిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సత్వర నాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగిన న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా పనిచేయాలని అన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేయుటకు పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుందని ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో అక్రమ గాంజా, పీడియస్ బియ్యం,అక్రమ ఇసుక రవాణా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాల పైన పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పేదలకు అందకుండా కొంతమంది అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తూ పక్కదారి పట్టిస్తూ పట్టుబడగా కేసులు నమోదు చేయబడ్డాయి తెలిపారు.
జిల్లా లో అక్రమ గంజాయి రవాణా,వినియోగం,అమ్మకం చేసే వారిని గుర్తించి వారి పైన కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అలవాటుగా నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో సన్న వడ్ల పైన ఇస్తున్న బోనన్ ఆసరాగా తీసుకుని కొంతమంది దళారుల,మిల్లర్లు రైతుల పేరిట ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకుంటున్నారు వారిని ఇప్పటికే గుర్తించి చెక్ పోస్ట్ లో వద్ద పకడ్బందీ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు.
అనంతరం వాడపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల చెక్ పోస్ట్ తనిఖి చేసి ఇతర రాష్ట్రాలనుండి అక్రమ పిడియస్,గంజాయి లాంటి రవాణా జరగకుండా 24/7 తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐలు వీరబాబు,కరుణాకర్,ఎస్సై లు లోకేష్,హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.