Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A shock to Chandrababu Naidu: చంద్రబాబు నాయుడికి షాక్

-- సీఐడి కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి -- లోతైన దర్యాప్తు కోసం రెండు రోజుల కస్టడీకి అంగీకారం

చంద్రబాబు నాయుడికి షాక్

— సీఐడి కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి

— లోతైన దర్యాప్తు కోసం రెండు రోజుల కస్టడీకి అంగీకారం

ప్రజా దీవెన/విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ( Vijayawada ACB Court gives Chandrababu CID custody permission) ఇచ్చింది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ కస్టడీకి ఐదు రోజుల పాటు ఇవ్వాలంటూ సీఐడీ ( CID asked Chandra babu Naidu to give them custody for five days) దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెల్లడించింది. శుక్రవారం ఉదయం క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే ఛాన్స్ ఉందని న్యాయవాదులు చెప్పడంతో మధ్యాహ్నానికి తీర్పును వాయిదా వేశారు.

హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు కూడా సీఐడీ కస్టడీపై తీర్పు ( ACB court also ruled on CID custody after Quash petition was dismissed) వెల్లడించింది. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది.