ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం194 మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆన్లైన్ దరఖా స్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది.
వివరణాత్మక నోటిఫికేషన్ రేపు సోమవారం జారీ చేస్తామని మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామ న్నారు.6వ తరగతిలో అన్నీ సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఏడు నుంచి పదో తరగతి వరకు మాత్రం ఆయా స్కూళ్లలోని ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూ ఎస్ కేటగిరీ విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించి, అప్లై చేసుకోవ చ్చని వివరించారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు…