Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ketawat Shankar Naik: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యల కు అమిత్ షా క్షమాపణ చెప్పాలి

–డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే జాతికి క్షమాపణ చెప్పా లని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
ఆదివారం నల్లగొండలోని మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగా న్ని ఎన్నో ప్రపంచ దేశాలు ఆదర్శం గా తీసుకున్నాయని అన్నారు, రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అని పేర్కొ న్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిపై పార్లమెంటు సాక్షిగా హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల మనో భావాలను దెబ్బతీసే విధంగా వ్య వహరించాడని ఆవేదన వ్యక్తం చేశారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని, బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడని తెలిపారు.

అంబేద్కర్ రాజ్యాంగంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత క్రైస్తవులు, మైనార్టీలు, అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.విభజించి పాలించు అనే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.పార్లమెంట్లో అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్లమెంట్ లో ఆందోళన చేశాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమిత్ షా పై చర్యలు తీసుకొని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను, అన్ని వర్గాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని స్పష్టం చేశారు.బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ధ్వజమెత్తారు.అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ ర్యాలీలో పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులంతా పాల్గొంటారని పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, కిన్నెర అంజి, పేర్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.