మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 23. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కేంద్రంలో కేతేపల్లి గ్రామ శివారులో ఆదివారం రోజున రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మృతుని బంధువులు కేతపల్లి గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం కొండమల్లేపల్లి కొత్త బావి గ్రామానికి చెందిన పిల్లి రామలింగం 28 సంవత్సరాలు నాంపల్లి మండలం దామర గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై రాత్రి తన ఊరైన కొత్త బావి గ్రామానికి తిరుగు ప్రయాణంలో కేతపల్లి గ్రామం మార్గమధ్యలో కొండమల్లేపల్లి నుండి ట్రాక్టర్ రామలింగం బైక్ను ఢీకొనడంతో ఆక్కడకక్కడే మృతి చెందాడు.
కొండమల్లేపల్లి నుండి ట్రాక్టర్ సింగిల్ లైట్ తో రావడంతో బైక్ వస్తుంది అని భావించి రామలింగం ట్రాక్టర్ ను ఢీకొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నట్లు తెలిపారు ఇంటికి పెద్ద దిక్కు అయినా రామలింగం మృతి చెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగారు. మృత దేహాన్ని. శివ పంచినామా నిమిత్తం నాంపల్లి ఎస్సై శోభన్ బాబు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు పరిశీలిస్తున్నారు