Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Semi-Christmas celebrations: ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ప్రజా దీవెన, కోదాడ: స్థానిక నయా నగర్ లోని కోదాడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మందిరమును విద్యుత్ దీపాలతో అలంకరించి పట్టణ వీధులలో క్రిస్మస్ గుర్తుగా ఉన్న అతిపెద్ద స్టార్ ను ఆవిష్కరించారు.
చర్చి గాయనీ గాయకులు ప్రత్యేకమైన పాటలు పాడి ప్రభువును మహిమ పరిచారు చిన్నపిల్లలు స్కిట్స్ మెమొరీ వర్సెస్ చేసి వచ్చిన భక్తులను అలరించారు.

పెద్దలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి సండే స్కూల్ పిల్లలకు స్మస్ గిఫ్ట్స్ అందించారు ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ క్రిస్మస్ ఒక అన్వేషణ అని క్రిస్మస్ అంటే ఆరాధన అని ఆనందమని ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగను సంతోష సమాధానాలతో ప్రభువు చెప్పిన మార్గంలో నడవాలని తెలిపారు.కోదాడ ప్రాంతప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి ఏసయ్య సంఘ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి యెసయ్య సయ్య,, జాన్ మోజాస్, శ్యాంబాబు, జగ్గు నాయక్, మేరమ్మ, రాంబాబు, తబిత సునీత, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు