Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harikishan Vedalankar: ఆదర్శప్రాయులు స్వామి శ్రద్ధానంద

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: స్వామి శ్రద్ధానంద ఆదర్శప్రాయుల ని ఆయన విద్యావేత్తగా, ఆర్య సమాజ్ కార్యకర్తగా ప్రసిద్ధి గాంచిన గొప్ప వ్యక్తి అని ఉమ్మడి రాష్ట్రాల ఆర్య ఆర్య ప్రతినిధి సభ మంత్రి హరికిషన్ వేదాలంకర్ అన్నారు. సోమవారం ఆర్య సమాజ్ ఆధ్వ ర్యంలో స్థానిక కాకతీయ హై స్కూల్ లో స్వామి శ్రద్ధానంద 98వ బలిదాన దినోత్సవం సందర్భంగా యజ్ఞం నిర్వహించి శ్రద్ధానంద స్వామి చిత్రపటానికి నివాళుల ర్పించారు.

అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో గురుకు లాలను స్థాపించారనీ, స్త్రీలకు విద్య బోధించడంలో కీలక పాత్ర పోషించి శ్రద్ధానంద స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసానికి ప్రభావితులై సామాజిక సంస్కరణ ఉద్యమంలో ముఖ్యపాత్రను పోషించారని అన్నారు. సరస్వతి బోధనలను ప్రచారం చేసిన ప్రముఖ వ్యక్తి అని కొనియాడారు సామాజిక కార్యకర్త స్వాతంత్ర సమరయోధుడు ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు బోయపల్లి కృష్ణారెడ్డి, కార్యదర్శి గోపాల్ రెడ్డి కార్యవర్గ సభ్యులు కోటయ్య, లక్ష్మీ నర్సు, షాపల్లిరవి ప్రసాద్ రావు, వేద మిత్ర, పాఠశాల కరస్పాండెంట్ నాగేందర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు