ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో గాంధీ టోపీలు ధరించి మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 19 రోజులుగా సమ్మె ప్రభావంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పేద పిల్లలకు విద్యాబోధన పూర్తిగా నిలిచిపోయిందని అయినా కూడా నేటికీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా మా యొక్క సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర ఉద్యోగుల యొక్క డిమాండ్ ను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపి న్యాయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న దాదాపు లక్ష యాభై వేల మంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు తక్షణమే విద్యాబోధన అందేలా సమస్య పరిష్కరించి సమ్మె విరమింపజేసి విద్యా వ్యవస్థ గాడిలో పడేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కు సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరిన ఉద్యోగుల సంఘం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, సలహాదారులు ఎం నీలాంబరి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత గ, సాయిల్ , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్,బొజ్జ అంజయ్య, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.