ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని వార్షిక మరియు సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి తెలిపారు.
2011- 2016 వరకు విద్య వార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును 12 ఫిబ్రవరి 2025 వరకు, ఆలస్య రుసుముతో 14 ఫిబ్రవరి 2025 వరకు బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు ప్రత్యేకంగా నిర్దేశించిన పరీక్ష ఫీజు తో పాటు, ఒక్కో సబ్జెక్టుకు ₹1000 ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావచ్చు అన్నారు.
డిగ్రీ 2016 -2020 వరకు సిబిసిఎస్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి బిఏ, బీకాం, బీఎస్సీ, బి బి ఏ కోర్సులకు నిర్దేశించిన ఫీజు చెల్లించి ఒక్కో సబ్జెక్టుకు అదనంగా వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావచ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వివిధ కారణాలతో తీర్ణత సాధించని విద్యార్థులు వినియోగించుకోవాలని సిఓఈ డా ఉపేందర్ రెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కొరకు విద్యార్థులు సంబంధిత డిగ్రీ కళాశాలలో మరియు విశ్వవిద్యాలయ వెబ్సైట్ ను సందర్శించవచ్చునని తెలిపారు.