ప్రజాదీవెన, నల్గొండ టౌన్: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆరో వైద్య విజ్ఞానిక మహాసభలకు హాజరైన ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఇతర టీజీవో టీఎన్జీవో నాయకులు మహాసభలలో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరారు. క్రమశిక్షణ గల టిఎస్ యుటిఎఫ్ సంఘం సహకారంతో పెండింగ్ సమస్యలు సాధిస్తామని తెలిపారు. ఇప్పుడున్న టీఎస్ ఈజేఏసీ నిజమైన జేఏసీగా తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పెన్షనర్స్ ఉపాధ్యాయ సమస్యలు జేఏసీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీవో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, టీజీవో కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, కోశాధికారి ప్రదీప్, ఆంజనేయులు, నరసింహ చారి, సైదులు, ఆకునూరి లక్ష్మయ్య, రాణి, భాస్కర్, సునీత తదితరులు పాల్గొన్నారు.