Arguments on ‘Chandrababu’ case in Supreme Court tomorrow: ‘ చంద్రబాబు’ కేసుపై రేపు సుప్రీకోర్టులో వాదనలు
‘ చంద్రబాబు’ కేసుపై రేపు సుప్రీకోర్టులో వాదనలు
ప్రజా దీవెన/ న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మంగళవారం వాదనలు వినేందుకు అనుమతిచ్చింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ను చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూథ్రా ప్రస్తావించగా చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ప్రస్తుతం చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్నారని అత్యవసరంగా, వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సీజేను లుథ్రా కోరారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు రేపు మరోసారి మెన్షన్ చేయాలని సూచించింది.
కాగా అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవుల నేపథ్యంలో మంగళవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు.