Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC AlugubelliNarsireddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో విద్యకు నిధుల కేటాయించాలి

–ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అత్యంత ప్రధాన విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 15 శాతం, కేంద్ర బడ్జెట్ లో 5- 6 శాతం నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్యకు ఇచ్చే అరకొర నిధులు సరిపోవడం లేదని, విద్య పటిష్టతకు సంవృ ద్ధిగా నిధులు కీటాయించాల న్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో లక్ష్మీ గార్డెన్ లో జరుగుతున్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆరవ విద్య వైజ్ఞానిక మహాసభలో భాగంగా రెండో రోజైన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహిం చడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ టిఎస్ యూటీఫ్ తొలి రోజూ మహాసభల్లో సదస్సుల్లో పాల్గొన్న వక్తలు ప్రభుత్వ విద్యారంగం పటిష్టం కావాలని ఆకాంక్షించారు. మహాసభల్లో ప్రభుత్వ విద్యా పటిష్టత పైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని, మహాసభలలో మధ్యాహ్న భోజనంలోనూ క్వాలిటీ పెంచాలి. మెనూ చార్జీలు పెంచాలని తీర్మానం చేసారు, బడికి సమాజాన్ని అనుసంధానం చేయాలని చర్చిస్తున్నారు‌.

అందరి సహకారంతో ప్రభుత్వ, పాఠశాల విద్య పటిష్టం జరగాలి.జంగయ్య, యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ
రాష్ట్ర మహాసభల్లో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతంపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నా యని,పాఠశాలల్లో ప్రభుత్వ పర్య వేక్షణ పెరగాలని అన్నారు. అన్ని రకాల పాఠశాలల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలి.అన్ని రకాల విద్యాసంస్థల్లో తాత్కాలిక భోధకులు ఉన్నారని , వీరి స్థానంలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠ్యంశాలనూ మరింత క్రియాశీలకంగా రూపొందించాలి అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంను పూర్తి స్థాయిలో అమలు చేసేలా నిధులు కేటాయిం చాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నో డిటెన్షన్ పాలసీ రద్దు సరికా దని,డ్రాప్ ఔట్స్ తగ్గించేందుకే నో డెటెన్షన్ విధానం తీసుకొచ్చారని తెలిపారు. గతంలో నో డెటెన్షన్ రద్దు అంశం తెరపైకి వస్తే కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా నో డెటెన్షన్ రద్దును వ్యతిరేకించాలని, ఆదా యపు పన్ను మినహాయింపు పరి మితిని 8 లక్షలకు, సేవింగ్స్ మిన హాయింపును 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం వస్తు సేవలపై జీఎస్టీ పెంచుతూ పోతుంది కానీ ఉద్యోగగుల ఆదాయపు పన్ను మినహాంపు మాత్రం పెంచడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లు, పెండింగ్ బిల్స్ చెల్లించాలని కోరారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలి. దీనిపై కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఏడాది అయినా దీనిపై చర్యలు లేవని , తక్షణమే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలన్నారు. విద్యా రంగ సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు రూపొంది స్తామని తెలిపారు.మహాసభల స్ఫూ ర్తితో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డి ని మరోసారి గెలిపించుకునేందుకు కృషి చేస్తామని, విద్యా అంశం రాష్ట్ర జాబితాలో ఉండాలన్నదే మా డిమాండ్ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారం టీల అమలుపై ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగానే మాకు కూడా పెండింగ్ లో ఉన్న డిఏ లు, ఇతర పెండింగ్ సమస్యలపై ఉద్యోగస్తుల డిమాండ్స్ కూడా ఉన్నాయి. మా ఉపాధ్యాయ సమస్యలనూ క్లియర్ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సిహెచ్. రాములు, రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్, రెడ్డి కోశాధికారి లక్ష్మారెడ్డి టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

MLC AlugubelliNarsireddy