ఎమ్మెల్సీల ఫైలు వెనక్కివచ్చిందోచ్
–ఫైల్ ను మళ్ళీ వెనక్కి పంపిన గవర్నర్
ప్రజా దీవెన/హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ ను గవర్నర్ తమిళిసై తిరిగి వెనక్కి ( Governor Tamilisai withdrew the file of Governor Kota MLCs) పంపారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులకు చాలా రోజుల క్రితమే ఫైల్ సిద్ధం చేసి పంపినా కాస్త ఆలస్యమైనా ఆమోదిస్తారని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ పెద్దలకు షాక్ ఇస్తూ ఫైల్ ను వెనక్కి పంపడం గమనార్హం.
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లు గవర్నర్ కోటాలో ఆమోద యోగ్యం కాదని ( The names of Dasoju Shravan and Kurra Satyanarayana are not acceptable in the Governor’s quota) ఫైల్ ను వెనక్కి పంపేశారు. దీంతో వారి స్ధానంలో కొత్త వారిని కేసీఆర్ సిఫార్సు చేయాల్సి ఉంది. నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవి కాలం ఎప్పుడో పూర్తి కాగా కొంత కాలం ఎవర్నీ నియమించకుండా కేసీఆర్ ఆలస్యం చేస్తే ఇప్పుడేమో గవర్నర్ కొంత కాలం ఆలస్యం చేసి ఏకంగా వారి పేర్లను వెనక్కి పంపేశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో మాత్రం గవర్నర్ ఆమోదం తప్పని సరి కావటంతో తమిళి సై అంత సామాన్యంగా ఓకే చేయడం లేదు. సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలంటే వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందిన వారిని , మేధావులను సిఫారసు చేయాలనే సంప్రదాయం (It is a tradition to recommend eminent persons and intellectuals in various fields) కొనసాగిస్తూ రాజకీయ నేతలకు అవకాశం కల్పించరు.
గతంలో పాడి కౌశిక్ రెడ్డి క్రీడలకు సేవ చేశారన్న కారణం చూపి నామినేట్ చేయగా పాడి కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు (The governor refused because there were cases against Padi Kaushik Reddy) . దాంతో ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో అవకాశం కల్పించారు. ఆయన పేరును గవర్నర్ వెంటనే ఆమోదించారు.
కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. దాసోజు శ్రవణ్ రాజకీయ నేతగానే అందరికీ పరిచయం కావడం, కుర్రా సత్యనారాయణ కూడా మాజీ ఎమ్మెల్యే కావటంతో ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించ లేదని గవర్నర్ కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.