ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :దీర్ఘకాలంగా సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.సోమవారం రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో జిల్లాలో పనిచేస్తున్న పలువురు సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు మంత్రిని కలిశారు.
రాష్ట్ర విద్యా శాఖలోని సమగ్ర శిక్షలో తాము దీర్ఘకాలంగా ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, తమకు వేతనాలు పెంచడంతోపాటు, తమను రెగ్యులరైజ్ చేయాలని, అలాగే బీమా, ఇతర బెనిఫిట్స్ ను కల్పించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.ఇందుకు స్పందించిన మంత్రి వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలపై ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి , తదితరులు ఉన్నారు.