కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
మునుగోడు ప్రజా దీవెన జనవరి 2 నూతన సంవత్సరం 20 25 నాంపల్లి మండల ప్రజ లు సుఖసంతోషాలతో జీవనం సాగించాలని కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు బుధవారం రోజున నాంపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో నూతన సంవత్సరం కేకును కట్ చేసి మిఠాయిలు పంచారు అనంతరం ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని నాంపల్లి మండల కేంద్ర ంలో నాలుగు రోడ్ల నిర్మాణం జరుగుతుందని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం సంక్రాంతి పండుగకు రైతు భరోసా అందిస్తుందని అందుకు ప్రజలు రైతులు ఇబ్బందులు పడవద్దు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం సహజమని అన్నారు ఈ కార్యక్రమంలో నాంపల్లి పట్టణ మాజీ వార్డ్ మెంబర్లు రంగా కొండయ్య పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుండెబోయిన సత్తయ్య నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటయ్య గౌడ్ నాయకులు బచ్చిన బోయిన బిక్షం కప్పెర లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.