Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandrapawar: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి: జిల్లా ఎస్పి శరత్ చంద్రపవార్

SP Sarath Chandrapawar: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, అదేవిధంగా జులైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము అని ఎస్పీ అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్-XI కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ పరిధిలో మూడు టీమ్ లుగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

18 సంవత్సరాల లోపు తప్పిపోయిన/ వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపనిలలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే సంభందిత యాజమాన్యాలపై కేసులు నమోదు తప్పవు అని హెచ్చరించారు.

నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు ఉన్న, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్న 1098 గాని, డయల్ 100కి గాని వారికి సమాచారం ఇవ్వాలి అని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని ఎస్పీ కోరినారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రాములు నాయక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ,అస్సిస్టెంట్ లేబర్ ఆపిసర్ కృష్ణవేణి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.