సమగ్ర శిక్షా Comprehensive Employees: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లాల్లో 24వ రోజు నిరోధిక సమ్మెలో భాగంగా ముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలోనైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మా కుటుంబాలలో కొత్త వెలుగులు నింపాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి పే స్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక పెద్ద గడియారం సెంటర్లో భారీ మానవహారం నిర్వహించి అక్కడి నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయం మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు దాదాపు 7 కిలోమీటర్లు శాంతియుత మహార్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భరగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గురీ కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత 24 రోజులుగా శాంతియుతంగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి మా యొక్క వేదనను తెలియజేస్తున్నా ప్రభుత్వం స్పందించట్లేదని తక్షణమే విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు దండెంపల్లి సత్తయ్య హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత
, సాయిలు , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.