Pawan Kalyan: ప్రజా దీవెన అమరావతి: అటవీ భూముల కబ్జాదారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అగ్రహోదగృడవుతున్నాడు. ఆక్రమణకు గురైన అటవీ భూము లను తిరిగి స్వాధీనం చేసుకొని, వాటిని పరిరక్షించే బాధ్యతలను స్వయంగా తానే భుజాన వేసుకు న్నారు. అందులో భాగంగా తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో జగన్ మోహన రెడ్డికి చెందిన సరస్వతీ పవర్ ప్లాం ట్ కి సంబంధించిన భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయ ని పెద్దఎత్తున పవన్ కల్యాణ్ ఆరో పణలు గుప్పించారు. దీనికి సంబం ధించిన విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన పవన్ కల్యాణ్ స్వ యంగా రంగంలోకి దిగారు.
ఆరోప ణలు చేసిందే తడువుగా ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల పర్యటన కు వెళ్లారు. సరస్వతీ పవర్ ప్లాంట్ ఉన్న మాచవరం, దాచేపల్లి మండ లాల్లోని పలు ప్రాంతాలను పర్య టించారు. అక్కడ భూములిచ్చిన ప్రజలతో సమావేశం అయ్యారు.
బాంబులు, తుపాకులతో జగన్ మనుషులు బెదిరించి లాక్కు న్నారని పవన్ కల్యాణ్ స్వయంగా వ్యాఖ్యలు చేశారు. అటవీ భూ ములను కూడా ఆక్రమించారని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చివరకి 28 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభు త్వం స్వాధీనం చేసుకుంది.
దీంతో పాటుగా మరో మూడు ఎకరాల వరకు ప్రభుత్వ భూములను స్వా ధీనం చేసుకుంది. అయితే ఇక్కడ అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు నిగ్గు తేల్చలేక పోయారు. ఇక్కడ 3 ఎకరాలు మ్రాతమే ప్రభు త్వ భూమి. తక్కిన 28 ఎకరాలు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమి. అయితే వారే సరస్వతీ పవర్ ప్లాంట్ కి విక్రయించారు. ఆ మేరకు రిజిస్టేషన్లు కూడా చేసుకు న్నారు. అయినా ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిం చిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుం బంపైకి దృష్టి పెట్టారు. సజ్జల కు టుంబం అటవీ భూములను ఆక్ర మించారని, ఎంత భూమిని ఆక్ర మించారో నిగ్గు తేల్చాలని కడప జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు.
కడప జిల్లాలో సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో సీకే దిన్నె రెవిన్యూ పరిధిలోని 1599, 1600/1,2, 1601/1,1ఏ, 2తో పాటు అనేక సర్వే నంబర్లలోని భూములు ఉండగా, వాటిల్లో 42 ఎకరాల మేరకు అటవీ భూములు కలిపేసుకొని, ఆక్రమించుకున్నారని సమాచారంపై పూర్తి స్థాయిలో వి చారణ జరపి నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ కడప జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. ఇలా సజ్జల కు టుంబం మొత్తం ఎంత మేరకు అటవీ భూములను ఆక్రమించుకు న్నారు అవి ప్రస్తుతం ఎవరి ఆధీ నంలో ఉన్నాయి వాటి వల్ల వన్య ప్రాణులకు, అటవీ జంతువులకు ఏమైనా హాని కలిగిందా తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదే శించారు.
అంతేకాకుండా ఆక్రమ ణలకు పాల్పడిన వారిపైన అటవీ భూముల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చే శారు. ఈ మేరకు సజ్జల భూము లపై విచారణకు కడప జిల్లా యం త్రాంగం రంగం సిద్ధం చేసింది. వైఎ స్ జగన్ మోహన రెడ్డి కూడా అట వీ భూములు ఆక్రమించారని, అసై న్డ్ భూములు లాక్కున్నారని ఆరో పించి, ఆ ప్రాంతాలకు వెళ్లి పర్య టించిన పవన్ కల్యాణ్, ఈ సారి కడప జిల్లాకు వెళ్లి సజ్జల భూముల పర్యటన చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.