Kattekolu Dipender: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సావిత్రిభాయి జయంతిని ప్రభు త్వం మహిళా ఉపాధ్యాయ దినో త్సవం జరపడంపై బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ హర్షం వ్యక్తం చేశారు.అణగారిన వర్గాల మహి ళల జీవితాలలో చీకట్లను ప్రారధో లి వెలుగులు నింపిన అక్షరజ్యోతి చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే 194వ జయంతిని పురస్కరిం చుకుని శుక్రవారం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సావిత్రి భాయి పూలే చిత్రపటానికి బీసీ యువజన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సంద ర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ మహిళలు విద్య ద్వారానే సామాజిక చైతన్య వంతులై తమ హక్కులు సాధించుకుంటారని భావించి మహిళల విద్యకోసం 1848లో పాఠశాల స్థాపించి ఎంతోమంది మహిళలకు విద్యనేర్పిన తొలి ఉపాధ్యాయురాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిభాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం హర్షణీయమన్నారు. మహిళలకు విద్యనేర్పడానికి పాఠశాలకు వెళ్లే సమయంలో స్త్రీలకు విద్యను వ్యతిరేకించే అగ్రవర్ణ పురుషులు గుంపులుగా నిలబడి పేడనీళ్లు పోసి రాళ్లతో కొట్టి పలురకాలుగా ఇబ్బందులకు గురిచేసినా వెనక్కి తగ్గకుండా స్త్రీలను చైతన్య పరచడానికి విద్యను నేర్పి, జ్ఞాన బోధ చేసిన గొప్పమహానీయురాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, రాము, అనిల్, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.